VSP: ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద జాలారిపేట, మూలపాలెం మత్స్యకార గ్రామాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం బుధవారం చేపట్టారు. మెరైన్ పోలీస్, మత్స్యకార సంఘాలు భాగస్వామ్యంతో బీచ్ పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డ్రగ్స్‌పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానిక విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.