AP: అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి చట్టాలను సవరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాడిగడపను మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లు, ఓటర్ జాబితా తయారీకి మరో 3 తేదీల ఖరారు, రాజధాని పరిధిలో 343 ఎకరాలకు సంబంధించి గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.