గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన మూవీ ‘జూనియర్’. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను ‘ఆహా’ సొంతం చేసుకోగా.. ఈ నెల 22 నుంచి సదరు OTTలోకి స్ట్రీమింగ్ కానుంది. ఇక రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.