తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన పొలిటికల్ డ్రామా ‘భద్రకాళి’ ఇవాళ విడుదలైంది. సచివాలయం ముందు కాఫీలు అమ్ముకునే కిట్టు(విజయ్) మొత్తం వ్యవస్థను శాసించే మీడియేటర్‌గా ఎలా ఎదిగాడు అనేది కథ. విజయ్ నటన, ఫస్టాఫ్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, BGM, విజువల్స్ మూవీకి ప్లస్. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్, అక్కడక్కడా గాడి తప్పినట్టుగా అనిపించిన కథనం మైనస్. రేటింగ్:2.5/5.