ATP: బ్రహ్మసముద్రంలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు శుక్రవారం యూరియా పంపిణీ జరిగింది. కార్యక్రమాన్ని జడ్పీటీసీ ఆర్.ప్రభావతమ్మ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు సరైన సమయంలో ఎరువులను పొందాలన్నారు. డీలర్లు వెంకటేశ్, క్రిష్టప్ప, మాజీ ఉప సర్పంచ్ బి.పరమేశ్, రైతు సంఘం అధ్యక్షుడు గొల్ల బిలేగౌడ్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.