SRD: 2002 నుంచి 2025 వరకు నాలుగు విడతలుగా ఓటర్ల మ్యాపింగ్ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పకడ్బందీగా ప్రక్రియను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీవోలు పాల్గొన్నారు.