VZM: ఎరువులను బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సీఐ సింహాచలం హెచ్చరించారు. నెల్లిమర్లలో ఎరువుల దుకాణాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి ఎరువుల నిల్వలను అంచనా వేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఎరువులు విక్రయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.