BHNG: రాజాపేట మండలం పారుపల్లి వాగులో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత 2023లో రూ.12.60 కోట్లు మంజూరు చేసి అట్టహాసంగా ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. కాగా గత 3 నెలల నుంచి నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో రాజాపేట నుంచి పారుపల్లికి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.