మహర్షి వాల్మీకి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఓ మూవీ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీ ట్రైలర్ కూడా వైరల్ అవుతుండగా.. దీనిపై అక్షయ్ స్పందించారు. అది AIతో చేసిన ఫేక్ వీడియో అని, అలాంటి వాటిని నమ్మకండని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకోకుండా సినిమాపై రాతలు రాస్తున్నాయని అన్నారు. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.