VSP: నాతవరానికి చెందిన దుండు తేజ నాతవరంలో గల తాండవ కాలువలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు ఎస్ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఉదయం కర్రి రాజబాబు పొలం వద్ద కల్వర్టు దగ్గర మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు తండ్రి దుండు రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.