AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయం స్పష్టంగా చెప్పిన.. YCP వాళ్లకు అర్థం కావట్లేదా? అని నిలదీశారు. ‘మహిళలను గౌరవించడం నాకు నేర్పారు. మా తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు మీకు గుర్తుకురాలేదా. ఒక తల్లి పడే ఆవేదన, బాధ నాకు తెలుసు. మా మహిళలపై కేసులు పెట్టారు.. మీరు అప్పుడు ఏం చేశారు’ అంటూ మండిపడ్డారు.