VSP: స్టీల్ ప్లాంట్లో ఎస్ఎంఎస్ విభాగంలోని కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న ముత్యాలు(44) క్రేన్ కింద పడి మృతి చెందాడు. గోపాలపట్నంకు చెందిన ముత్యాలు ఎస్ఎంఎస్ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధి నిర్వహణలో ఉండగా క్రేన్ కింద పడి మృతి చెందినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు.