NLR: పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో దసరా నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు శివశక్తి క్షేత్రంలో విశాలాక్షి అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందోహంతో నిండిపోయింది. ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.