AP: శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసుల చర్చ సమయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. YCP సభ్యలను కంట్రోల్ చేయాలి.. అందరికీ ఒకే రూల్ ఉండాలని మంత్రి లోకేష్ ఛైర్మన్‌ను కోరారు. YCP సభ్యలు తమవైపు చేయి చూపించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని మీరు కాపాడాలి అధ్యక్ష అని అన్నారు. కాగా, ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా YCP సభ్యలు వాకౌట్ చేశారు.