SKLM: ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఐసీడీఎస్ పివో శోభారాణి తెలిపారు. బుధవారం పోషణ మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు కూడా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని తద్వారా మాత శిశు మరణాలు తగ్గించడం జరుగుతుందన్నారు.