KMM: పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించాలని, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదని.. చర్యలు తప్పవని కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.రాజేందర్ తెలిపారు. మంగళవారం నగరంలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో జరుగుతున్న ఎన్డీఎల్సీ దూరవిద్య డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు.