MNCL: ఫోటోగ్రఫీతో జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శుక్రవారం హైదరాబాదులో నిర్వహిస్తున్న ఫోటో ఎక్స్పోలో కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తి జ్ఞాపకాలను సజీవంగా ఉంచి భావితరాలకు అందించే మంత్రదండం ఫోటోగ్రఫీ ఆయన అన్నారు. ఫోటో, వీడియో గ్రాఫర్లు దృశ్యరూపాలను కాపాడుతూ భావితరాలకు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు.