W.G: రాగులు, సజ్జలు, కొర్రలు, మినుములు వంటి చిరుధాన్యాలలో పోషకాలు మెండుగా ఉంటాయని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసు బాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం నాన్న కళ్యాణ మండపంలో తల్లులకు ఆరోగ్యం- పోషణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు చిరుధాన్యాలను తీసుకోవాలన్నారు. అనంతరం మహిళలకు పరీక్షలు చేశారు. ఇందులో డీఐవో డాక్టర్ సుధా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.