SKLM: ప్రతి ఇంటి నుండి వంద శాతం చెత్త సేకరణ జరగాలని టెక్కల్ డివిజన్ DDO మంగమ్మ అన్నారు. శుక్రవారం MPDO కాళీ ప్రసాద్ రావుతో కలిసి మేజర్ పంచాయతీలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్త సేకరణ జరగాలన్నారు. వాటి నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసి గ్రామాలలోని ప్రజలకు వీటిపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.