అన్నమయ్య: జిల్లా పుల్లంపేట గ్రామానికి చెందిన చింతగింజల ద్వారకా గోపీనాథ్‌ను రాయలసీమ పద్మశాలి సంఘం కార్యనిర్వాహక సభ్యుడిగా నియమించారు. సంఘం అధ్యక్షుడు కొంకటి లక్ష్మీనారాయణ శుక్రవారం ఈ నియామకాన్ని ప్రకటించి, నియామక పత్రాన్ని గోపీనాథ్‌కు అందజేశారు. సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించగా, గోపీనాథ్ అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.