మహారాష్ట్రలోని హివారే బజార్ గ్రామ సర్పంచ్ పోపట్రావ్ బాగుజీ పవార్. ఆయన నాయకత్వంలో కరువుతో ఉన్న ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా మారింది. వర్షపు నీటిని నిల్వ చేయడం, వాటిని సంరక్షించడం, చెట్లు పెంచడం వంటివి చేసి గ్రామాన్ని పచ్చదనంతో నింపారు. ఆయన మార్గదర్శకత్వంలో గ్రామంలోని ప్రతి ఇల్లు ఆర్థికంగా బలపడింది. ఆయన తెచ్చిన మార్పుకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.