TPT: తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని, 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని టీటీడీ తెలిపింది. శుక్రవారం 71, 249 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 22,901 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో రూ.4.04 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.