టాలీవుడ్ నటి సదా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ వారం రోజుల క్రితం మరణించారు. ఆమె ఈ విషయాన్ని తెలిపి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘మా నాన్న చనిపోయి వారం రోజులైనా.. ఓ యుగం గడిచినట్లు అనిపిస్తుంది. సినిమా అనేది అమ్మాయిలకు సేఫ్ కాదని అందరూ చెప్పినా సపోర్ట్‌గా నిలిచారు. ఆయన వెలకట్టలేని మనిషి.. మిస్ యూ నాన్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను’ అని రాసుకొచ్చింది.