టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తున్న మూవీ ‘ఫంకీ’. ఈ సినిమాతో అనుదీప్ మరోసారి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు విశ్వక్ మార్క్‌తో కాకుండా అనుదీప్ తనదైన స్టైల్లో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీని 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నారట.