RR: శేర్లింగంపల్లి పరిధిలో పార్కులను అద్భుతంగా పునరుద్ధరించి, సుందరీకరించినట్లు అధికారులు తెలిపారు. సిద్ధార్థ నగర్ పార్కు, మధుర నగర్ సి-బ్లాక్ పార్కును తీర్చిదిద్దిన అధికారులు, అద్భుతమైన మౌలిక వసతులతో, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా చూశారు. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపే అవకాశం ఉందన్నారు.