సీనియర్ జర్నలిస్ట్ VSN మూర్తిపై ఫిల్మ్ ఛాంబర్‌కు మంచు లక్ష్మి ఫిర్యాదు చేశారు. ‘దక్ష’ మూవీ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మూర్తి అడిగిన ప్రశ్నలు అగౌరవంగా అనిపించాయని తెలిపారు. వయసు, వేసుకునే బట్టలపై ప్రశ్నించడం జర్నలిజం కాదన్నారు. కాగా, ఇంటర్వ్యూలో మూర్తి.. ’50ఏళ్లకు దగ్గరవుతున్న మీరు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు’ అని ప్రశ్నించడం వివాదంగా మారింది.