GNTR: తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా, మంత్రి నాదెండ్ల మనోహర్ చినరావూరులో పర్యటించారు. మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లతో కలిసి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసి, అధికారులకు తగిన సూచనలు చేశారు.