MBNR: జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు.