టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ‘శివ’ ఒకటి. అక్కినేని నాగార్జునతో దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా 1989లో రిలీజై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ANR జయంతి సందర్భంగా నాగార్జున దీని రీ-రిలీజ్ డేట్ను ప్రకటించారు. నవంబర్ 14న ఈ చిత్రం 4K వెర్షన్లో మరోసారి విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు.