‘మహాభారతం’ మూవీ కోసం 30ఏళ్లుగా ప్రణాళికలను వేసుకుంటున్నట్లు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చెప్పారు. ఇది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, మరో రెండు నెలల్లో దీని స్క్రిప్ట్ పనులు స్టార్ట్ కానున్నట్లు తెలిపారు. దీన్ని ఒక సినిమాగా కాకుండా యజ్ఞంలా పూర్తి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు అందరూ మెచ్చేలా ఈ మూవీని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.