VSP: సీఎస్ఆర్ నిధులతో దివీస్ లాబొరేటరీస్ అందించిన సైన్స్ కిట్లను ఆనందపురం హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు శనివారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అందజేశారు. నియోజకవర్గంలోని భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఉన్న 3 కేజీబీవీల సహా మొత్తం 44 హైస్కూల్స్‌లో విద్యార్థులందరికీ ఈ కిట్లను ఇవ్వడం జరిగింది.