VZM: కొత్తవలస భూగర్భ వంతెనలో మంగళవారం గంటపాటు కురిసిన వర్షానికి పూర్తిగా వర్షం నీటితో నిండిపోయింది. దీంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వంతెన ఆనుకొని సంత జరగడంతో కొనుగోలుదారులు ఆపసోపాలు పడుతున్నామని వాపోతున్నారు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎన్.వి. రమణ( లైన్స్) దృష్టికి తీసుకువెళ్లగా వర్షంనీరు చేరకుండా కాలువలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.