BPT: బాపట్ల జిల్లాలో ఇంకా 171.600 టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 289.205 టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. రైతుల ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రైతులకు సకాలంలో యూరియా అందిస్తామన్నారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేస్తామన్నారు.