సత్యసాయి: పెనుకొండ మండలంలో మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం మాజీ సీఎం జగన్ 470 కోట్లకు టెండర్లను పిలిచి కేవలం 35 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని మడకశిర ఎమ్మెల్యే MS రాజు తెలిపారు. శనివారం పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు ఏం ఉద్ధరించారని మెడికల్ కాలేజీ మీద జగన్ ఫ్లెక్సీలు పెట్టారని ప్రశ్నించారు.