WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి పాఠశాలలో శనివారం జరిగిన SGFI జోనల్ స్థాయి క్రీడల పోటీల్లో ZPHS కట్ర్యాల విద్యార్థులు కబడ్డీ, ఖోఖోలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈఓ శ్రీధర్ తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను MEO అభినందించారు. అక్టోబర్ 8, 9న వరంగల్ ‘ఓ’ సిటీలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారని MEO శ్రీధర్ పేర్కొన్నారు.