AKP: కొయ్యూరు మండలం బాలారం, కంఠారం గ్రామాలను గొలుగొండ మండలంలో విలీనం చేయాలని ఆ గ్రామస్థులు శనివారం జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్రకు నర్సీపట్నంలో వినతిపత్రం అందజేశారు. మా గ్రామాలు గొలుగొండ మండల సరిహద్దులో ఉన్నాయన్నారు. మా గ్రామాల నుంచి కొయ్యూరు వెళ్లాలంటే 39 కిలో మీటర్ల దూరమని దీంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.