సత్యసాయి: అత్యాచారం కేసులో రొళ్ల మండలానికి చెందిన సిద్దరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ అనంతపురం జిల్లా 4 క్లాస్ అదనపు న్యాయాధికారి తీర్పు చెప్పారు. సిద్దరాజును 2018లో అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాత నేరం రుజువు కాగా సిద్దరాజును ముద్దాయిగా ప్రకటిస్తూ న్యాయాధికారి తీర్పు వెలువరించారు.