KRNL: ఆదోని అర్బన్ పరిధిలోని ఇస్వీ గ్రామానికి చెందిన యాస్మిన్ (30) శుక్రవారం భర్త నబీసాహెబ్తో సొంతూరుకు వెళ్తుండగా, ఆటో ఆపి కాలువలో ముఖం కడుక్కునేందుకు వెళ్లి జారిపడింది. దీంతో స్థానికుల సహాయంతో భర్త ఆమెను ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించిందని ఆమె భర్త తెలియాజేశాడు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపాడు.