కృష్ణా: కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు సహకారంతో గుడివాడ ధనియాలపేటలోని అంగన్వాడీ కేంద్రానికి కుక్కర్, గ్లాసులు, వంట సామగ్రిని వితరణగా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు అల్పాహారానికి అవసరమైన సామాగ్రిని అంగన్వాడీ కేంద్రానికి అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరికుమార్, ప్రభు, రాము, బాలాజీ పాల్గొన్నారు.