KRNL: హోళగుంద మండలం దేవరగట్టు గ్రామంలో జరుగనున్న బన్నీ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శనివారం గ్రామంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, నేరనికి, తండా, కొత్తపేట గ్రామాల ప్రతినిధులు, పోలీసు శాఖ, వైద్య, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు శాంతియుత వాతావరణంలో పాల్గొనడంపై అవగాహన కల్పించాలన్నారు.