SRD: మైనర్ పిల్లలకు బైకు నడిపేందుకు ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని కంగ్టి సీఐ వెంకటరెడ్డి శనివారం తెలిపారు. దసరా సెలవులు సందర్భంగా పిల్లలు సరదా కోసం బైకులు నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడికి సరైన వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్,హెల్మెట్ ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.