అన్నమయ్య: రాయచోటి పట్టణంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా షేక్ మునీరా, ఆమె కుమారుడు ఇలియాస్ మృతి చెందారు. శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా SP మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ తరఫున ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, మంత్రి వ్యక్తిగతంగా రూ.1 లక్ష అందజేస్తారని స్పష్టం చేశారు.