MLG: మిర్యాలగూడలో ఇటీవల స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కొత్త రకం సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరగాళ్లు వివిధ సంస్థల నకిలీ ప్రొఫైళ్లను సృష్టించి, పెట్టుబడులు పెట్టిన వారికి తొలుత లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నారు. ఆ లాభాలను చూసి మరింత పెట్టుబడి పెట్టినవారు డబ్బు పోగొట్టుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రాజు సూచించారు.