GNTR: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా శనివారం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె సంగడిగుంటలో జరుగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.