అమెరికా వెళ్లాలనే తన కల కేవలం 3 నిమిషాల్లో చెదిరిందని ఓ కస్టమ్స్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. US వెళ్లేందుకు సదరు అధికారి టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా ఇంటర్వ్యూకు వెళ్లగా తన దరఖాస్తును తిరస్కరించినట్లు తెలిపారు. లాస్ ఏంజెలెస్ బదులుగా శాన్ఫ్రాన్సిస్కో అని చెప్పడమే తాను చేసిన పొరపాటు అని చెప్పారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.