SKLM: పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో “స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో కదంబ, బాదం, చెర్రీ, మామిడి వంటి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఎం.ఎస్.ఎస్.నాయుడు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత పర్యావరణ సమతుల్యం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు