VZM: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న పినతాడివాడ గ్రామం, పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం భోగాపురం సీఐ రామకృష్ణ, స్థానిక ఎస్సై సన్యాసి నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఆవరణలో మొక్కలు నాటి, ప్రకృతిని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.