MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన గొర్రెలు, మేకల సంతను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ ఛైర్పర్సన్ పాలాది సారిక, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, రైతులు, కొనుగోలు దారులు పాల్గొన్నారు.