BDK: ఫారెస్ట్ అధికారులు పోడు భూముల సాగుదారులను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదని, పంట చేతికొచ్చిన వారి భూములను ధ్వంసం చేయడం సరైన చర్య కాదని మణుగూరు సామాజిక కార్యకర్త అడ్వకేట్ కర్నె రవి అన్నారు. శనివారం ఫారెస్ట్ అధికారులు పంటలు ధ్వంసం చేసిన మణుగూరు మండలం పగిడేరు గ్రామపంచాయతీ వలస ఆదివాసీలో గ్రామం ఇప్పల గుంపులో ఆదివాసులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు.