KNR: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు జరుగుతాయని డీఈవో శ్రీరాం మొండయ్య తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ బాలికల పాఠశాలలో, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు హాల్టికెట్లు తీసుకొని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.